Vadagalla Vaana in Telangana: ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల రైతులకు బ్యాడ్ న్యూస్. రెండు జిల్లాల్లో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. రెండు జిల్లాల్లోనూ భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లింది. చేతికి అందొచ్చిన వరి చేన్లు వడగండ్ల వానకు నీట మునిగాయి. ఈదురుగాలులకు వడగండ్లు తోడవడంతో వరి చేన్లలో వరి కంకులు మొత్తం నేలరాలాయి. కొన్ని చోట్ల వరి చేన్లు కోసినప్పటికీ.. ధాన్యం కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో మూలుగుతుండగా ఇవాళ కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిముద్దయింది. దీంతో పంట నష్టపోయిన రైతులు ఇక తామెలా కోలుకోవాలి అని కన్నీరు మున్నీరవుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూర్, మోత్కూర్, గుండాల, మోట కొండూరు మండలాల్లోని పలు గ్రామాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఆయా మండలాల్లోని అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలుల తాకిడికి హుజూర్ నగర్ మెయిన్ రోడ్డుపై భారీ ఈదురు గాలులతో చెట్లు విరిగి పడ్డాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: మండు వేసవిలో వర్షాకాలం.. రైతులకు టెన్షన్ టెన్షన్
మొత్తానికి ఆదివారం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సుమారు గంట పాటు ఈదురు గాలులతో వడగండ్ల వాన కురవడంతో రైతులే కాకుండా సాధారణ జనం సైతం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అనేక చోట్ల రేకుల ఇళ్లపై వడగండ్ల వాన కురవడంతో రేకులు ధ్వంసమై ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో పంట నష్టపోయిన రైతులతో పాటు ఇళ్లు దెబ్బతిన్న వారు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న పార్టీ వెనుక ఎవరున్నారు ? తెలంగాణలో అసలేం జరుగుతోంది ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK