తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలంగాణలో శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలు 

Last Updated : Jul 5, 2019, 11:25 PM IST
తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు

హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఆలేరు, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, జఫర్‌గఢ్, చిల్పూర్, పాలకుర్తి, తిర్మలగిరి, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లోనూ వర్షం కురిసింది. హైదరాబాద్‌ భాగ్యనగరంతోపాటు మెదక్‌, పెద్దపల్లి జిల్లాల్లోనూ వర్షపాతం నమోదైంది. 

కుమ్రం భీం జిల్లా చింతలమనేపల్లిలో భారీ వర్షానికి దిందా వాగు పొంగిపొర్లింది. దీంతో దిందా, కేతి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రహదారి వ్యవస్థ సరిగ్గా లేని ప్రాంతాల్లో వర్షాల కారణంగా రాకపోకలు స్తంభించాయి.

Trending News