హైదరాబాద్: గచ్చిబౌలిలో ఆగిఉన్న ప్రయాణీకులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి

హైదరాబాద్‌ నగరం నగరం సమీపంలోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం సంభవించింది.

Updated: Sep 13, 2018, 04:47 PM IST
హైదరాబాద్: గచ్చిబౌలిలో ఆగిఉన్న ప్రయాణీకులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి

హైదరాబాద్‌ నగరం సమీపంలోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. సిటీ బస్టాప్‌లో నిలిచి ఉన్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కోఠి నుంచి లింగంపల్లి వెళ్తున్న బస్సు.. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రయాణికులపైకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకునున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.