Cheddi Gang: మియాపూర్ లో చెడ్డి గ్యాంగ్ కలకలం.. వైరల్ గా మారిన షాకింగ్‌ వీడియో..

Cheddi Gang Theft: చెడ్డి గ్యాంగ్ మరోసారి హల్ చల్ చేశారు. మియాపూర్ లో ఉన్న వరల్డ్ వన్ స్కూల్ కౌంటర్‌లో అర్ధరాత్రి మారణాయుధాలతో ప్రవేశించారు. ఆ తర్వాత అక్కడ స్కూల్ కౌంటర్ లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును చోరీ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 18, 2024, 06:00 PM IST
  • మియాపూర్ లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్
  • వైరల్ గా మారిన చోరీ దృశ్యాలు
Cheddi Gang: మియాపూర్ లో చెడ్డి గ్యాంగ్ కలకలం.. వైరల్ గా మారిన షాకింగ్‌ వీడియో..

Hyderabad Cheddi Gang Halchal In Miyapur: మరోసారి చెడ్డిగ్యాంగ్ ముఠాలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పోలీసులు దేశంలో ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న క్రమంలో చెడ్డి గ్యాంగ్ లు చోరీకిలకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. దీంతో నగరవాసులు.. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మియాపూర్ లోని వరల్డ్ వన్ స్కూల్ లో చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించారు. ఆతర్వాత  అక్కడ ఉన్న కౌంటర్ లో ఉన్న దాదాపు..  7 లక్షల 85 వేలన చోరీ చేసినట్లు స్కూల్ యజామాన్యం గుర్తించింది.

 

చెడ్డీ గ్యాంగ్ సభ్యులు అర్ధరాత్రి స్కూల్ లో ప్రవేశించి, చోరీలకు పాల్పటిన కదలికలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. దుండగులు మారణాయుధాలతో చెడ్డీ గ్యాంగ్ స్కూల్ లో ప్రవేశించారు. కొందరు ముసుగులు వేసుకుని, నల్ల చెడ్డీలు వేసుకున్నారు. ఒంటిపై నూనెకూడా పోసుకున్నట్లు కన్పిస్తుంది. వీరు అత్యంత క్రూరంగా మారణాయుధాలతో చోరీలకు పాల్పడతారు.

Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..

ఇలాంటి సమంలో వీరిని ఎవరైన అడ్డగిస్తే.. అత్యంత దారుణంగా హతమారుస్తారని చెబుతుంటారు. ఇప్పటికే దేశంలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు. తాజాగా, మరోసారి హైదరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ కదలికలు వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఫింగర్ ప్రింట్ ను తీసుకున్నారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News