Hyderabad Fire Accident: నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం.. తొమ్మిది మంది మృతి.. ఆ డ్రమ్ములే కారణమా..?

Fire Breaks Out In Nampally: హైదరాబాద్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లోని కెమికల్‌ గోదాంలో మంటలు చెలరేగి.. పైన ఉన్న అంతస్తులకు వ్యాపించాయి. దీంతో కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 13, 2023, 01:42 PM IST
Hyderabad Fire Accident: నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం.. తొమ్మిది మంది మృతి.. ఆ డ్రమ్ములే కారణమా..?

Fire Breaks Out In Nampally: హైదరాబాద్‌లోని నాంపల్లిలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. బజార్‌ఘాట్‌లోని కెమికల్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వివరాల ప్రకారం.. కెమికల్‌ గోదాంలో మంటలు చెలరేగి.. నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు చిక్కుపోయారు. మంటల్లో చిక్కుకున్న 21 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదపులోకి రాగా.. అపార్ట్‌మెంట్‌లో దట్టమైన పొగ అలముకుంది.

అగ్నిప్రమాద ఘటనపై డీసీపీ వెంకటేశ్వర్లు స్పందించారు. అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గ్యారేజ్‌ ఉందని.. అక్కడ కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు చెలరేగినట్లు వెల్లడించారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని.. కింది ఫ్లోర్ నుంచి అపార్ట్‌మెంట్‌పైకి మంటలు వ్యాపించాయని తెలిపారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న డీజిల్, కెమికల్ డ్రమ్ములు పేలడంతో మంటలు భారీ వ్యాపించాయన్నారు. మూడు, నాలుగు అపార్ట్‌మెంట్స్‌లో కొన్ని కుటుంబాలు అద్దెకు ఉన్నాయని.. పొగతో ఊపిరి ఆడకపోవంతో కొందరు చనిపోయారని చెప్పారు.  

నాంపల్లి అగ్ని ప్రమాదం పై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్యాతి  వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అగ్ని ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందని విమర్శించారు. వరస అగ్ని ప్రమాదలు జరుగుతున్నా.. ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. అపార్ట్‌మెంట్‌ సెల్లర్‌లో కారు మరమ్మతులు ఏంటి..? అని ప్రశ్నించారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలన్నారు. మృతులకు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

Also Read: Samsung Galaxy A25 5G Price: దీపావళి సందర్భంగా సాంసంగ్ గుడ్ న్యూస్‌..మార్కెట్‌లోకి మరో డ్రాప్ నాచ్‌ 5G మొబైల్‌!  

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News