Hyderabad Gold Robbery: హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలం సృష్టించాయి. ఓ జ్యువెలరీ దుకాణంను గుర్తుతెలియని దుండగులు దోచుకున్నారు. షాపు యజమాని సహా మరొకరిపై కాల్పులు జరిపి.. జ్యువెలరీ దుకాణంలోని బంగారు ఆభరణాలతో పాటు డబ్బు తీసుకుని పరారయ్యారు. ఈ ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన షాపు యజమాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
రాజస్థాన్ పాలి జిల్లా లోటోపి గ్రామానికి చెందిన కల్యాణ్ చౌదరి (34) పదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్నేహపురి కాలనీ రోడ్‌నంబర్-6లో మహదేవ్ జ్యువెలరీ దుకాణం రన్ చేస్తున్నాడు. ఇక ఎన్‌జీవోస్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి హోల్ సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్.. కల్యాణ్ చౌదరి జ్యువెలరీ దుకాణానికి వచ్చాడు. అదే సమయంలో పల్సర్, యాక్టివా బైక్‌లపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు జ్యువెలరీ దుకాణంకు వచ్చారు. షాపు షటర్‌ను మూసివేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కల్యాణ్, సుఖ్‌దేవ్ గాయపడ్డారు.
కాల్పులు జరిపిన అనంతరం సుఖ్‌దేవ్ చౌదరి చేతిలోని బ్యాగ్‌ను దుండగులు లాక్కున్నారు. దుకాణంలో నుంచి గన్ సౌండ్ రావటంతో స్థానికులు షాపు ముందుకు వచ్చారు. కొందరు షాపు షటర్ తీసి.. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా దుండగులు తుపాకీ చూపించి భయపెట్టారు. దాంతో స్థానికులు వెనక్కి తగ్గారు. దుండగులు సంచి తీసుకుని బైక్‌లపై ఆర్‌కేపురం వైపు పారిపోయారు. స్థానికులు సమాచారం మేరకు ఎల్‌బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ మధుసూధన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని నాగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
దుకాణం యజమాని కల్యాణ్ చౌదరి చెవికి బుల్లెట్ తగలగా.. బంగారం సప్లయర్ సుఖ్‌దేవ్‌కు మెడ, వీపు వెనుక భాగంలో బుల్లెట్ తగిలింది. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన వారు షాపు యజమాని సుఖ్‌దేవ్‌కి తెలిసిన వారా? లేదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్‌ను అనుసరించే.. దుండగులు వచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారైనట్లు తెలుస్తోంది.
Also Read: Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి ప్రమాదం.. ఇది నాలుగోసారి!
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. వరుసగా మూడో రోజు పెరిగిన పసిడి ధర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook