Hyderabad Metro: వర్షాకాలం మొదలైంది.. హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటలపాటు వర్షం ఆగకుండా కురవడంతో హైదరాబాద్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారింది. ఇళ్లకు వెళ్లే క్రమంలో వర్షం పడడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్ల వెంట భారీగా ట్రాఫిక్ స్తంభించగా.. మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించాలని వెళ్లగా అక్కడ కూడా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. హైదరాబాద్ మెట్రో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు రైళ్లు ఆగిపోగా.. పలు మెట్రో స్టేషన్లలో గేట్లు తెరుచుకోలేకపోయాయి.
హైదరాబాద్‌లో సాయంత్రం 4.30 నుంచి దాదాపు 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది. అన్ని ప్రాంతాల్లో వర్షం కురవడంతో అప్పుడే ఇళ్లకు వెళ్తున్న ఉద్యోగులు మెట్రోను ఆశ్రయించారు. వర్షం వలన మెట్రో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అత్యంత రద్దీ ఉండే మియాపూర్- ఎల్బీనగర్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్‌లో సాంకేతిక సమస్యతో మెట్రో ఎగ్జిట్ మిషన్లు మొరాయించాయి.
ఇక ఎర్రమంజిల్ స్టేషన్‌లో సాంకేతిక సమస్యలతో రైలు ఆగిపోయింది. కొన్ని నిమిషాల పాటు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉక్కపోత భరించలేక ఎమర్జెన్సీ డోర్ తెరుచుకుని బయటకు వచ్చాయి. అయితే సాంకేతిక కారణాలతో రైళ్లు నిలిపివేసినట్లు మెట్రో అధికారులు తెలిపారు. కాగా వర్షం కారణంగా బస్సుల్లో ప్రయాణిచే ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించడంతో కిటకిటలాడాయి.
Also Read: KT Rama Rao: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశే.. కానీ ఫినీక్స్ పక్షిలాగా తిరిగి పుంజుకుంటాం
హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్
భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో భారీగా వాహనాలు స్తంభించాయి. విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడడంతో ఉద్యోగులు అవస్థలు పడ్డారు. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, ఐకియా చౌరస్తా, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మెహిదీపట్నం, లక్డీకాపూల్, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ వర్షం కారణంగా చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter