Septic Tank Cleaners Died: సెప్టిక్ ట్యాంక్ లో పడి ఇద్దరు కార్మికులు మృతి

Septic Tank Cleaners Died: గచ్చిబౌలి ఫరిదిలోని కొండాపూర్‌ గౌతమి ఎన్‌క్లేవ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషంగా ఉందని పోలీసులు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2021, 01:55 PM IST
    • హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం
    • సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఇద్దరు మృతి
    • మరొక కార్మికుడి పరిస్థితి విషమం
Septic Tank Cleaners Died: సెప్టిక్ ట్యాంక్ లో పడి ఇద్దరు కార్మికులు మృతి

Septic Tank Cleaners Died: హైదరాబాద్ గచ్చిబౌలిలోని గౌతమి ఎన్‌క్లేవ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆ నివాస సముదాయంలోని సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. గౌతమి ఎన్‌క్లేవ్‌లోని అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఇద్దరు కూలీలు దిగారు. అయితే కాసేపటి తర్వాత వారికి ఊపిరాడక అందులోనే చనిపోయారు. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

గౌతమి ఎన్‌క్లేవ్‌లోని అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు తొలుత ఇద్దరు కూలీలు దిగారు. కాసేపటికి వారికి ఊపిరాడక అందులోనే చనిపోయారు. విషవాయువులు వెలువడటంతో చనిపోగా ..ఇది గమనించి లోపలికి దిగిన వెంటనే బయటకు వచ్చారు మరో ఇద్దరు కార్మికులు. ఓ కార్మికుడి పరిస్థితి విషమంగా వుంది. మరో కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

మృతులను నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గాజీనగర్‌ చెందిన శ్రీను, ఆంజనేయులుగా గుర్తించారు. తమకు న్యాయం చేయాలని మృతుల కుటంబసభ్యులు అపార్ట్‌మెంట్‌ ఓనర్లను డిమాండ్‌ చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

Also Read: Brutal Murder: గోదావరిఖనిలో దారుణ హత్య-ముక్కలుగా నరికి ఒక్కో భాగాన్ని ఒక్కో చోట...

Also Read: Hyderabad: టెక్‌ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం..15 రోజుల సెలవులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News