Hyderabad: టెక్‌ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం..15 రోజుల సెలవులు!

Covid-19: బహదూర్‌పల్లిలోని టెక్‌ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ 25 మంది విద్యార్థులకు, ఐదుగురు అధ్యాపకులకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 08:37 PM IST
Hyderabad: టెక్‌ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం..15 రోజుల సెలవులు!

Covid-19 in Tech Mahindra University: హైదరాబాద్ బహదూర్‌పల్లిలోని  టెక్‌ మహీంద్ర వర్సిటీ(Tech Mahindra University)లో కరోనా కలకలం సృష్టించింది. 25 మంది విద్యార్థులు, ఐదుగురి సిబ్బంది కొవిడ్ బారిన పడటంతో...వర్సిటీకి 15 రోజుల సెలవు ప్రకటించింది.

వర్సిటీలో కరోనా కేసులు(Corona Cases) బయటపడిన నేపథ్యంలో...వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. డీఎంహెచ్‌వో మల్లికార్జున్‌ వర్సిటీని పరిశీలించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 30 మంది కరోనా బాధితులు ఉన్నట్లు తెలిపారు. వర్సిటీ సిబ్బందికి, సమీపంలోని దుకాణదారులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే పాజిటివ్‌ వచ్చిన వారంతా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారేనని చెప్పారు.

Also Read: Odisha: రెసిడెన్షియల్‌ పాఠశాలలో కరోనా కలకలం..26 మంది విద్యార్థినులకు పాజిటివ్!

రెండు రోజుల కిందట కర్ణాటకలోని ధార్వాడ్ మెడికల్ కాలేజీ(Dharwad Medical College)లోని విద్యార్థులు భారీ సంఖ్యలో కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌(Covid-19 Third Wave) విజృంభించే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్(New Variant) కలవరానికి గురిచేస్తోంది. దీంతో పలు దేశాలు మళ్లీ ఆంక్షలు బాట పట్టాయి. ఈ నేపథ్యంలో...ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ(PM Modi) భేటీ అయ్యారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News