ఈ నెల 26 నుంచి రెండు రోజుల పాటు ఈ గవర్నెన్స్‌పై జరగనున్న జాతీయ స్థాయి సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ సదస్సు జరగనుంది. 26, 27 తేదీలలో 8 రకాల విభాగాల్లో 5 ప్లీనరీ సెషన్స్ జరుగుతాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనున్న ఈ సదస్సులో కేంద్ర మంత్రులు వైఎస్ చౌదరి, సీఆర్ చౌదరీ, జితేంద్రసింగ్ పాల్గొననున్నారు.
ఇదిలావుంటే, హైదరాబాద్ ఇటీవల కాలంలో అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులు. సమావేశాలకు వేదికవుతున్న సంగతి తెలిసిందే. వరల్డ్ ఐటీ కాంగ్రెస్, బయో ఏషియా సదస్సు ముగిసిన తర్వాత ఇదే హెచ్ఐసీసీ వేదికగా ఈ-గవర్నెన్స్‌పై జాతీయ సదస్సు జరగనుంది. ఆ తర్వాత మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించకుని ఆ రోజున మహిళా పారిశ్రామిక వేత్తల హబ్‌ను ప్రారంభిస్తున్నామని ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మార్చి 8 నుంచి 11 వరకు వింగ్స్ ఇండియా సదస్సు జరుగుతుందని కేటీఆర్ స్పష్టంచేశారు.