SVP Trailer: 'సర్కారు వారి పాట' ట్రైలర్‌నూ వాడేసిన హైదరాబాద్​ పోలీసులు!

Hyderabad Police use SVP Trailer. వాహదారులకు హెల్మెట్‌పై అవగాహన కల్పించేందుకు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' ట్రైలర్‌ను హైదరాబాద్​ పోలీసులు బాగా వాడేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 03:12 PM IST
  • 'సర్కారు వారి పాట' ట్రైలర్‌నూ వదలని పోలీసులు
  • హెల్మెట్‌పై అవగాహన కల్పించేందుకు
  • హెల్మెట్​ ధరించండి, భద్రత ముఖ్యం
SVP Trailer: 'సర్కారు వారి పాట' ట్రైలర్‌నూ వాడేసిన హైదరాబాద్​ పోలీసులు!

Hyderabad Traffic Police use SVP Trailer for Helmet Awareness: సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ.. పోలీసులపై మాత్రం బాగానే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్​ నగర ట్రాఫిక్ పోలీసులపై. వాహనదారులను ప్రమాదాల నుంచి కాపాడేందుకు సినిమాలను బాగా వాడుతున్నారు. వాహదారులకు హెల్మెట్‌పై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే చాలా సినిమాల డైలాగ్స్, సీన్స్, పాటలను వాడిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట'ను కూడా బాగా వాడేశారు. 

ఫామిలీ డైరెక్టర్ పరుశురామ్‌ దర్శకత్వం వహించిన 'సర్కారు వారి పాట' సినిమాలో మహేశ్‌ బాబు, కీర్తి సురేష్​ జంటగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మే 12న విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో.. చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసిన చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను వదిలింది. 

'సర్కారు వారి పాట' ట్రైలర్​లోని సీన్లు, డైలాగ్​లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం ప్రేక్షకులనే కాకుండా హైదరాబాద్​ ట్రాఫిక్ పోలీసులను సైతం ఫిదా చేశాయి. ట్రైలర్​లో విలన్​కు హెల్మెట్​ పెడుతూ.. మహేశ్​ బాబు ఓ డైలాగ్​ చెప్తాడు. ఈ సీన్​ను హైదరాబాద్​ సిటీ పోలీస్​ ట్విటర్ అకౌంట్​ నిర్వాహకులు వాడేశారు. డైలాగ్స్ కాకుండా కేవలం సీన్స్ మాత్రమే ఉపగోగించుకున్నారు. ఆ పోస్టుకు 'హెల్మెట్​ ధరించండి, భద్రత ముఖ్యం' అంటూ ట్వీట్​ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాహదారులకు హెల్మెట్‌పై అవగాహన కల్పించేందుకు వారు పడుతున్న శ్రమను అందరూ అభినందిస్తున్నారు. 

Also Read: Giraffe Video: అయ్యో రాములా.. తిండి కోసం తిప్పలు పడుతున్న జిరాఫీ! భూమ్మీద గడ్డి తినడానికి..!

Also Read: హృతిక్‌ రోషన్‌ చేసిన పనికి నా హృదయం ముక్కలైపోయింది.. స్టార్ హీరోయిన్ ఆవేదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News