Giraffe Video: అయ్యో రాములా.. తిండి కోసం తిప్పలు పడుతున్న జిరాఫీ! భూమ్మీద గడ్డి తినడానికి..!

Giraffe eating video. జిరాఫీకి భూమ్మీద ఉండే గడ్డి అందదు కదా అని మీరు ఆలోచిస్తున్నారా?. జిరాఫీ తన పొడవైన ముందు కాళ్లను కాస్త ఎడంగా సాపి.. భూమ్మీద ఉండే గడ్డిని తింటుంది.

Edited by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 01:47 PM IST
  • తిండి కోసం తిప్పలు పడుతున్న జిరాఫీ
  • భూమ్మీద గడ్డిని తినడానికి జిరాఫీ ఏం చేస్తుందో చూడండి
  • తెలివైన జిరాఫీ
Giraffe Video: అయ్యో రాములా.. తిండి కోసం తిప్పలు పడుతున్న జిరాఫీ! భూమ్మీద గడ్డి తినడానికి..!

Giraffe use super technic to eat grass on the earth: ఈ భూ ప్రపంచంలో కొన్ని జంతువులు నేలపై ఉండే గడ్డి తినడానికి ఎలాంటి ఇబ్బంది పడవు. ఆవు, ఎద్దు, బర్రె, గుర్రం, గాడిద, మేక, గొర్రె లాంటి జంతువులు భూమ్మీద ఉన్న గడ్డిని సునాయాసంగా తమ నోటి ద్వారా తీసుకుంటాయి. అయితే జంతువులలో అత్యంత ఎత్తు ఉండే జిరాఫీ మాత్రం.. భూమ్మీద ఉండే గడ్డిని తినడానికి చాలా కష్టపడుతుంది. ఎందుకంటే.. జిరాఫీ మెడ చాలా పొడవుగా ఉంటుంది కాబట్టి. అందుకే జిరాఫీ ఎక్కువగా చెట్టుకు ఉండే ఆకులను ఆహారంగా తీసుకుంటుంది. తాజాగా భూమ్మీద ఉన్న గడ్డిని తినడానికి ఓ జిరాఫీ చేస్తున్న ఫీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. 

సమాంతర ప్రాంతంలో ఓ జిరాఫీ గడ్డిని తింటుంది. అయితే జిరాఫీకి భూమ్మీద ఉండే గడ్డి అందదు కదా అని మీరు ఆలోచిస్తున్నారా?. జిరాఫీ తన పొడవైన ముందు కాళ్లను కాస్త ఎడంగా సాపి.. భూమ్మీద ఉండే గడ్డిని తింటుంది. చాలా సమయం అలా ఉండలేదు కాబట్టి మళ్లీ మామూలు స్థితికి వస్తుంది. అనంతరం గడ్డి తినేందుకు సదరు జిరాఫీ మరలా తన కాళ్లను ఎడంగా సాపి గడ్డిని తింటుంది. తనకు అందని గడ్డిని తినేందుకు ఆ జిరాఫీ ఉపయోగించే టెక్నిక్ అందరినీ ఆకట్టుకుంటోంది. 

ఇందుకు సంబందించిన వీడియోను ట్విట్టర్ యూజర్ సురేన్ పోస్ట్ చేశారు. 'ఈ జిరాఫీ జరోడా దగ్గరలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ వద్ద 3 నెలలు గడ్డి తింది. ఆ సమయంలోనే అలా తినడం నేర్చుకుంది. ఆ జిరాఫీ అక్కడ పరేడ్ చేయడం కూడా నేర్చుకుంది' అని వీడియోకు సురేన్ కాప్షన్ ఇచ్చారు. కేవలం ఆరు సెకండ్లు మాత్రమే ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫన్నీ వీడియో, తెలివైన జిరాఫీ, అయ్యో రాములా.. తిండి కోసం తిప్పలు పడుతున్న జిరాఫీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ఈ వీడియో మే 1న సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. దీనికి ఇప్పటివరకు 3.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో లక్షల్లో లైకులు వస్తున్నాయి. ఈ వీడియోని మొదట ట్విటర్‌లో బ్యూటెంగేబిడెన్ షేర్ చేశారు. జిరాఫీకి తినడం, పోట్లాడటం, నీళ్లు తాగడం ఇష్టం. అత్యంత ఎత్తైన జంతువులు అయిన జిరాఫీలు ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తాయి. జిరాఫీలు వారానికి ఒకసారి మాత్రమే నీటిని తీసుకుంటాయి. 

Also Read: హృతిక్‌ రోషన్‌ చేసిన పనికి నా హృదయం ముక్కలైపోయింది.. స్టార్ హీరోయిన్ ఆవేదన!

Also Read: IPL 2022 Umpiring: క్యాచ్ అయితే వైడ్ ఇచ్చాడు.. అతడికి ఉత్తమ అంపైరింగ్‌ అవార్డు ఇవ్వండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News