హైదరాబాద్‌లో రోహింగ్యా ముస్లిముల అరెస్టు

హైదరాబాద్‌‌లో నకిలీ ఆధార్, ఓటర్ కార్డులు కలిగున్న ఇద్దరు రోహింగ్యా ముస్లిములను పోలీసులు అరెస్టు చేశారు

Last Updated : Jul 9, 2018, 10:20 PM IST
హైదరాబాద్‌లో రోహింగ్యా ముస్లిముల అరెస్టు

హైదరాబాద్‌‌లో నకిలీ ఆధార్, ఓటర్ కార్డులు కలిగున్న ఇద్దరు రోహింగ్యా ముస్లిములను పోలీసులు అరెస్టు చేశారు. 2013లో అబ్దుల్ ఖైర్, మహ్మద్ అయూబ్ అనే ఇద్దరు రోహింగ్యాలు మయన్మార్ నుండి బయలుదేరి బంగ్లాదేశ్ సరిహద్దు కూడా దాటి.. ఆ తర్వాత భారత్‌లోకి అడుగుపెట్టారు. తర్వాత హైదరబాద్ చేరి హై కమీషనర్‌ను కలిసి తాము శరణార్థులమని చెబుతూ.. ఉపాధి కల్పించమని కోరారు.

అయితే కొన్నాళ్ల తర్వాత భారతీయ పౌరులుగా చెలామణీ అవ్వడం కోసం ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు కూడా దొంగ పేర్లతో పొందారు. అబ్దుల్ 2017లో పాస్ పోర్టు పొందగా.. అయూబ్ ఇటీవలే ఆధార్ కార్డు కూడా పొందారు. కొన్నాళ్లుగా వీరి కదలికలపై గురి పెట్టిన పోలీసులు.. ఆఖరికి వారి ఇంటిని సోదా చేయగా పాస్ పోర్టు, ఆధార్ కార్డు దొరికాయి. ఈ క్రమంలో వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. 

ప్రస్తుతం హైదరాబాద్‌లో 3500 నుండి 4000 వరకు రోహింగ్యాలు అనధికారికంగా నివసిస్తున్నట్లు సమాచారం. వారు వివిధ రాష్ట్రాల నుండి ఉపాధి పేరుతో హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. అలాగే కొందరు పూర్తిగా భారతీయులతో కలిసి పోవడానికి ప్రయత్నిస్తూ.. ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, డ్రైవింగ్ లెసెన్సులు, పాస్ పోర్టులు, బ్యాంకు అకౌంట్ ఖాతాలు కూడా పొందుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు రోహింగ్యా ముస్లిములపై ఎప్పటి నుండో నిఘా వేసిన పోలీసులు ఆఖరికి సోమవారం బాలాపూర్ ప్రాంతంలో అరెస్టు చేశారు.

Trending News