Wife murders husband: భార్యాభర్తల మధ్య తలెత్తిన ఓ గొడవ చివరకు భర్త ప్రాణాలను బలితీసుకుంది. క్షణికావేశంలో భర్తపై భార్య కత్తితో దాడి చేయగా... తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె విఫలయత్నం చేసింది. హైదరాబాద్‌లోని (Hyderabad) సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం... నల్గొండ (Nalgonda) జిల్లా బుసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మురళీధర్‌రెడ్డి (42), మౌనిక దంపతులు 11 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ప్రస్తుతం సరూర్ నగర్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంటులో నివసిస్తున్నారు.వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు శ్రేయాస్ రెడ్డి ఉన్నాడు. మురళీధర్ రెడ్డి హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో హార్డ్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా... మౌనిక కూడా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది.
కొన్నాళ్లుగా మురళీధర్ రెడ్డి,మౌనిక దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల మౌనిక డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు రాసేందుకు తమ స్వగ్రామానికి వెళ్లి ఈ నెల 6న తిరిగొచ్చింది. మౌనిక ఇంటికి రాగానే కుమారుడు శ్రేయాస్ రెడ్డి తండ్రిపై ఆమెకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఇంట్లో లేని సమయంలో చుట్టుపక్కలవారికి,బంధువులకు ఫోన్లు చేసి చెడుగా ప్రచారం చేశాడని చెప్పాడు.దీనిపై మౌనిక భర్త మురళీధర్ రెడ్డిని గట్టిగా నిలదీసింది.
Also Read Bhopal Fire Accident: ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. నలుగురు చిన్నారులు మృతి
ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగ్గా.. తీవ్ర ఆగ్రహావేశంతో కూరగాయల కత్తితో అతనిపై దాడికి పాల్పడింది (Wife stabs husband). మురళీధర్ రెడ్డి మెడపై బలమైన గాయమవడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు.తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు .భర్త మృతితో భయపడ్డ మౌనిక ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించింది.భర్త మురళీధర్ రెడ్డి తనకు తానే మెడపై కత్తితో పొడుచుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి (Osmania hospital) తరలించారు.పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మురళీదర్ రెడ్డి తల్లిదండ్రులకు అప్పగించారు. భర్త అంత్యక్రియలకు మౌనిక వెళ్లకపోవడం గమనార్హం. దీంతో మురళీధర్ రెడ్డి తల్లిదండ్రులకు మౌనికపై అనుమానం కలిగింది.ఇంతలో మౌనిక సరూర్ నగర్ (Saroor nagar) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి... తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది. దీంతో ఆమెపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు (Hyderabad police) రిమాండ్‌కు తరలించారు.
Also Read : Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆ నాలుగురోజులు అప్రమత్తంగా ఉండాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook