Weather Forecast today: తెలంగాణలో మరో 3 రోజలపాటు వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ..

Rain Alert: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ ను జారీ చేశారు అధికారులు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2023, 11:15 AM IST
Weather Forecast today: తెలంగాణలో మరో 3 రోజలపాటు వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ..

Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ఆవరించి ఉండటంతో ఈదురుగాలులతోపాటు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో అయితే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతోపాటు అక్కడక్కడ పిడుగులపడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

ఈ మేరకు కుమురం భీం, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తెలంగాణలో ఉదయం పూట భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే.. సాయంత్రం వరుణుడు జోరు వానను కురిపిస్తున్నాడు. గత రెండు రోజులుగా తెలంగాణలో 36 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ఈనేపథ్యంలో అన్నదాతలను ఓదార్చేందుకు సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు.  

మరో వైపు ఏపీలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలతోపాటు వడగాళ్ల వానలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. అంతేకాకుండా పిడుగుల పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. 

Also Read: CM KCR: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. చరిత్రలో నేడు చీకటి రోజు: సీఎం కేసీఆర్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News