Rains in Telangana: హైదరాబాద్: రాగల మూడు రోజులు పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరుపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె.నాగరత్న తెలిపారు. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ప్రభావంతోనే రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి జల్లులు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు.
Also read : నిండు కుండలా శ్రీశైలయం డ్యామ్.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల
ఇదిలావుంటే, ఇప్పటికే గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy rains) రాష్ట్రంలో అనేక చోట్ల చెరువులు, వాగులువంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో (Nirmal floods) అనేక గ్రామాల్లో వరదలు పోటెత్తి సంగతి తెలిసిందే.
Also read : దళిత బంధు పథకంపై హై కోర్టులో పిల్ దాఖలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook