PV Sindhu Bonalu 2022: అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన పీవీ సింధు!

PV Sindhu Offers Bonam to Lal Darwaza Simhavahini Mahankali Ammavaru. లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారికి భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు బంగారు బోనం సమర్పించారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 24, 2022, 05:53 PM IST
  • అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన పీవీ సింధు
  • క్యూలో నిల్చొని మరీ
  • గతేడాది పోటీల వల్ల రాలేకపోయా
PV Sindhu Bonalu 2022: అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన పీవీ సింధు!

PV Sindhu Offers Bonam to Lal Darwaza Simhavahini Mahankali Ammavaru: హైదరాబాద్‌లో అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాడమాసం చివరి ఆదివారం అయిన ఈరోజు లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు, కోడలు మొదటి బోనాన్ని సమర్పించారు. 

లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారికి భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు బంగారు బోనం సమర్పించారు. ప్రతి ఏడాది అమ్మవారికి బోనం సమర్పించే సింధు.. టోర్నమెంట్‌ కారణంగా గతేడాది రాలేకపోయారు. ఇప్పుడు స్వయంగా బొనమెత్తి అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. రద్దీగా ఉన్నా క్యూలో నిల్చొని మరీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బ్యాట్మింటన్ స్టార్ సింధును ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది.

'నాకు హైదరాబాద్ బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటా. గతేడాది బోనాల సమయంలో పోటీల వల్ల అమ్మవారిని దర్శించుకోలేకపోయా. ఈ ఏడాది అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఏటా బోనాల పండగకు హాజరవుతా' అని తెలుగు తేజం పీవీ సింధు చెప్పారు. లండన్‌ వేదికగా జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌ 2022 కోసం ఈరోజు ఇంగ్లండ్‌కు బయలుదేరనున్నారు. జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్‌ గేమ్స్‌ పోటీలు జరగనున్నాయి.

Also Read: పాట పాడుతూ ఆవును ఆటపట్టిందామనుకున్న యువకుడు.. చివరికి ఏమైందో చుడండి! నవ్వు ఆపుకోలేరు

Also Read: అందమైన యువతికి లిప్ కిసెస్ ఇస్తూ.. ముద్దుముద్దుగా మాట్లాడుతున్న చిలుక! 20 సార్లు చూశా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News