KTR ON BJP: తెలంగాణ రాజకీయాలు కొన్ని రోజులు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వ్యక్తిగత దూషణలతో రచ్చ చేస్తున్నారు నేతలు. ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించి వెళ్లారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చారు. హన్మకొండలో నిర్వహిస్తున్న తెలంగాణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొంటున్నారు. జేపీ నడ్డా సభ కోసం బీజేపీ నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు.
జేపీ నడ్డా తెలంగాణ పర్యటనపై స్పందిస్తూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్రమైన సెటైర్లు వేశారు. ఈరోజు జేపీ నడ్డా చప్పల్‌ను ఏ గులాం మోస్తారు?.. తీవ్రమైన పోటీ ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈనెల 21న మునుగోడు బహిరంగ సభకు హాజరయ్యారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. హైదరాబాద్ లోనూ పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర జరిగిన ఓ ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది. ఈ ఘటనను ఉద్దేశిస్తూ కేటీఆర్ తాజా ట్వీట్ చేశారని తెలుస్తోంది.
Pop quiz:
Which Ghulam will carry the Chappal of JP Nadda today?
Am sure there is intense competition 😁 pic.twitter.com/Tz8YiCYIiS
— KTR (@KTRTRS) August 27, 2022
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటికి వచ్చారు అమిత్ షా. అయితే గుడి బయట ఆయన విడిచిన చెప్పులను చేతితో పట్టుకొచ్చి అమిత్ షా కాళ్ల దగ్గర పెట్టారు బండి సంజయ్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ సంజయ్ తీరుపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. తెలంగాణ బీజేపీ నేతలు పార్టీ నేతలకు గులాంగురి చేస్తున్నారంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. గుజరాత్ గులాములు తెలంగాణ బీజేపీ నేతలు అంటూ కొందరు పోస్టులు పెట్టారు. అటు కమలనాధులు మాత్రం పెద్దవాళ్లను గౌరవిస్తే తప్పేంటని కౌంటరిచ్చారు. బండి సంజయ్ కూడా దీనిపై వివరణ ఇచ్చారు. గతంలో కేసీఆర్ చాలా మంది కాళ్లక నమస్కారం చేశారని గుర్తు చేశారు.
Read also: Munawar Faruqui: మునావర్ ఫరూఖీ ఢిల్లీ షో రద్దు.. మరీ హైదరాబాద్ లో ఎందుకు అనుమతి ఇచ్చినట్లు?
Read also: Chiranjeevi: రెండు, మూడు రోజుల్లో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చిరంజీవి... కారణమిదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook