Jagga reddy sensational comments on Balka suman: ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఉద్యమ సమయంలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులను బాల్క సుమన్ చంపినట్లు తనకు సమాచారం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. బాల్క సుమన్ తన గడ్డంలో వెంట్రుకతో సమానమన్న జగ్గారెడ్డి పీకేస్తే పోతాడని ఘాటు కామెంట్లు చేశాడు.
రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై రాజుకున్న వివాదం పెద్దదవుతోంది. తెలంగాణ ప్రజలకు క్షమాపణచెప్పాకే రాహుల్ గాంధీ ఓయూలో పర్యటించాలన్న బాల్క సుమన్ కామెంట్లు వేడిపుట్టిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఓయూలో రాహుల్ పర్యటనకు పర్మిషన్ ఇవ్వకుండా టీఆర్ఎస్ నేతలు వీసీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన రాహుల్ కు అనుమతెందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రాహుల్ పర్యటనకు అనుమతివ్వకుంటే ఏం చేయాలో తమకు తెలుసన్నారు. ఈ నెల 31 న విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేస్తానన్నారు.
విప్ బాల్కసుమన్ రాజకీయం తన గడ్డంలో వెంట్రుకతో సమానమన్నారు జగ్గారెడ్డి. ఉద్యమం సమయంలో ఇద్దరు ముగ్గురు విద్యార్థులను సుమన్ చంపి... ఆ డెడ్‌బాడీ చేతుల్లో సూసైడ్ లెటర్లు పెట్టినట్లు తనకు కొన్ని లేఖలు అందాయన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ఇష్యూపై విచారణ జరిపిస్తానన్నారు. సుమన్ ను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత సుమన్ కు ఉందా అని ప్రశ్నించారు. రేవంత్ కూ అభిమాన సంఘాలు ఉంటాయని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. పెద్దోళ్లను తిట్టి పెద్దోడవ్వాలని చూస్తున్నాడని ఫైరయ్యాడు. సుమన్ ఓవరాక్షన్ చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.
ఉద్యమ సమయంలోనే తాను సమైక్య నినాదం వినిపించానన్నారు జగ్గారెడ్డి. తన సంగతి ఇంకా పూర్తిగా తెలియదని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ కు డప్పు కొట్టి ఎమ్మెల్యే అయ్యాడని.. ఇంకా డప్పుకొట్టి మంత్రి అవ్వాలని చూస్తున్నాడన్నారు. సుమన్ కు గన్‌మెన్ లేకుండా ఓయూ వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. తమ విద్యార్థిసంఘం నేతలే సుమన్ పని చూసుకుంటారన్నారు. యూనివర్సిటీ ఏమైనా సుమన్ తన అడ్డా అనుకుంటున్నాడా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి
Also read: Samantha Birthday: సమంతకు బర్త్ డే విషెస్ చెప్పిన రౌడీ హీరో, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.