Harish Rao On Rahul Gandhi And Revanth Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈ నెల 30న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి అంటూ విమర్శించారు. గతంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. వాళ్ల తండ్రి మరణిస్తే అంత్యక్రియలు చేశాక స్నానం చేయడానికి కరెంట్ లేదని అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. ఆనాడు సోనియా గాంధీని బలి దేవత అన్నాడని.. ఇటలీ బొమ్మ అన్నాడని నోటికి ఏదోస్తే అదే తిట్టారని అన్నారు.
ఇప్పుడు సోనియాగాంధీ దేవత అంటున్నాడని.. రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలని అంటూ ఎద్దేవా చేశారు హరీష్ రావు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ వచ్చి తాను బీజేపీతో పోరాడుతా.. బీజేపీపై పోరాడే డీఎన్ఏ తనది అన్నారని.. మరి రేవంత్ రెడ్డి డీఎన్ఏ ఏదో రాహుల్ తెలుసుకోవాలని హితవు పలికారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డీఎన్ఏలు మ్యాచ్ కావట్లేదని సెటైర్లు వేశారు.
తాము ఎవరికీ బీ టీమ్ కాదని.. తాము తెలంగాణ ప్రజల టీమ్ అని హరీష్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికి ఒకటి కాదని.. నీళ్లు, నూనె ఎప్పుడైనా కలుస్తాయా..? ఇది కూడా అంతేనని అన్నారు. కేసీఆర్‌కు పనితనం తప్ప.. పగతనం లేదన్నారు. కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేయకపోవునా..? అని ప్రశ్నించారు. పక్క రాష్టాల్లో చూస్తున్నామని.. వాళ్లు గెలవగానే వీళ్లను జైలుకు పంపిస్తారని.. వీళ్లు గెలవగానే వాళ్లను జైలుకి పంపిస్తారని ఏపీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
Also Read: Maruti Suzuki Jimny Discounts: మారుతి సుజుకి జిమ్నీ కొనేవారికి బంపర్ గుడ్ న్యూస్
Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.