Minister Ponguleti: స్కూళ్ల కు సెలవులపై నిర్ణయం కలెక్టర్ల దే.. కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి ..

Heavy rain fall in Telangana: తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. మంత్రి పొంగులేటీ జిల్లా కలెక్టర్లతో  కలిసి వీడియో కాన్ఫరెన్స్  సమావేశం నిర్వహించారు.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 20, 2024, 04:22 PM IST
  • కీలక ఆదేశాలు జారీ చేసిన రెవెన్యూ మంత్రి..
  • కలెక్టర్ లకు నిర్ణయం మేరకే ఇక మీదట హలీడేస్..
Minister Ponguleti: స్కూళ్ల కు సెలవులపై నిర్ణయం కలెక్టర్ల దే.. కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి ..

Minister ponguleti video conference meeting with the district collector: తెలంగాణలో కొన్నిరోజులుగా కుండపోతగా వర్షం కురుస్తుంది. దీంతో వాగులు పొంగిపోర్లుతున్నాయి. నదులు, ప్రాజెక్టులు కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి. అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి మరీ నీళ్లను కిందకు వదిలిపెడుతున్నారు. ఇదిలా ఉండగా.. వర్షాల వల్ల జనాలు బైటకు వెళ్లలని పరిస్థితి ఏర్పడింది. రోడ్లంతా జలమయమైపోయింది. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో.. మరేక్కడ నాలాలు ఉన్నాయో.. కూడా వర్షాలు పడినటప్పుడు గుర్తించడం కష్టం. మరోవైపు ఉద్యోగస్థులు, విద్యార్థులు వర్షాలు పడినప్పడు వెళ్లలేక నరకం అనుభవిస్తుంటారు. ఈ నేపథ్యంలో వర్షాలు కుండపోతగా కురిసినప్పుడు చాలా మంది సెలవులు ప్రకటించాలని కోరుకుంటారు.

తమ విద్యార్థులను బైటకు పంపేందుకు చాలా మంది తల్లిదండ్రులు తెగ భయపడిపోతుంటారు. అంతేకాకుండా.. ఎక్కడైన కరెంట్ వయర్ తెగిపడి ఉంటే.. మరేదైన అనుకొని ఆపద సంభవిస్తే.. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతుందని చెప్తుంటారు. ఈ క్రమంలో కుండపోతగా వర్షం కురవగానే.. సెలవులపై పెద్ద రచ్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలో రెవెన్యు మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

పూర్తివివరాలు.. 

కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జనాలు చిగురుటాకుల మాదిరిగా వణికిపోతున్నారు. ఈనేపథ్యంలో.. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గాలులు కూడా బలంగా వీస్తున్నాయి. ఉరుములు,మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి ఆయా జిల్లాల కలెక్టర్లతో , సీఎస్ శాంతికుమారీ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఇకమీదట.. వర్షాలు పడినప్పుడు సెలవులు ప్రకటించే నిర్ణయం ను కలెక్టర్ తీసుకొవాలన్నారు.  స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి సెలవులు ఇవ్వాలా.. లేదా అనేదానిపై వారికి పూర్తిగా బాధ్యత అప్పగిస్తున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

ఈరోజు తెల్లవారు జామున కురిసిన వర్షానికి  జనాలు అల్లాడి పోయారు. ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించాలని కూడా.. అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కానీ దీనిపై చాలా ఆలస్యంగా తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుందని కొంత మంది విమర్శిస్తున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు.. సర్కార్ కు తమ బాధలు చెప్పుకున్నట్లు తెలుస్తోంది.

Read more: Trainee Doctor murder: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిందితుడు సంజయ్ రాయ్.. షాకింగ్ విషయాలు బైటపెట్టిన అత్త.. వీడియో వైరల్..  

ఈ క్రమంలో మంత్రి పొంగులేటీ ఈరోజు జిల్లాల కలెక్టర్లతో.. కుండపోతగా కురుస్తున్న వానలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా అధికారుల పరిధిలో వర్షాకాలంలో తీసుకొవాల్సిన జాగ్రత్తలపై పలు ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా.. వర్షం కురిసినప్పుడు జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించే అధికారం వారికే ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News