కమ్యూనిస్టుల మద్దతుపై స్పందించిన మంత్రి తలసాని

కమ్యూనిస్టుల మద్దతుపై స్పందించిన మంత్రి తలసాని

Updated: Oct 4, 2019, 12:35 AM IST
కమ్యూనిస్టుల మద్దతుపై స్పందించిన మంత్రి తలసాని
File photo

హైదరాబాద్: హుజూర్ నగర్ ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ పార్టీ వెళ్లి కమ్యూనిస్టుల మద్దతు కోరడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం అంటూ ఏదీ ఉండదని, హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పార్టీ కమ్యూనిస్టుల మద్దతు కోరటంలో తప్పులేదని మంత్రి తలసాని అన్నారు. కాంగ్రెస్‌లో ఐక్యతలేదని ఆపార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న తలసాని.. హుజూర్‌నగర్‌ ప్రచారం కోసం వెళ్లాలని గాంధీభవన్‌లో నిర్ణయించుకుంటే.. సూర్యాపేట వెళ్లే వరకూ దారి పొడవునా తిట్టుకుంటూ, కొట్టుకుంటూ పోయే సంస్కృతి వారిదని కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేశారు. గురువారం మాసాబ్‌టాంక్‌లోని పశుసంవర్ధ శాఖ డైరెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసుకున్న కార్యాలయాన్ని ప్రారంభించే క్రమంలో మంత్రి తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈసందర్భంగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక గురించి మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తాను టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపుకోసం హూజూర్‌నగర్‌కు వెళ్లనున్నట్టు తెలిపారు.