ఓటు వేసే సమయంలో ముస్లిం మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు - ఈసీ రావత్

                          

Last Updated : Oct 25, 2018, 11:17 AM IST
ఓటు వేసే సమయంలో ముస్లిం మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు -  ఈసీ  రావత్

హైదరాబాద్: డిసెంబర్ 7న తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ బృందం మూడు రోజుల పాటూ తెలంగాణలో పర్యటించింది. అనంతరం కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలు ధరించే బురఖా అంశంపై స్పందిస్తూ బుర్ఖా ధరించిన మహిళా ఓటర్లు పురుష పోలింగ్ అధికారుల ముందు తమ ముఖం చూపించాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ పేర్కొన్నారు. 

మహిళా ఓటర్ల  కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఈ సందర్భంగా ఓపీ రావత్ మాట్లాడుతూ మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని  అధికారులను ఆదేశించామన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద మహిళా సిబ్బందితో పాటు మహిళా పోలీసులను నియమిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ఓపీ రావత్ పేర్కొన్నారు. 

ఓటింగ్ శాతం పెంచేందుకే..

బుర్ఖా తొలగిస్తారనే కారణంగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ముస్లిం మహిళలు ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు. అలాగే తనిఖీలు చేసే పోలీసులు ఎక్కువ శాతం పురుషులే ఉంటున్నారు. ఈ కారణం చేత మహిళలు పోలింగ్ లో యాక్టీవ్ గా పాల్గొనడం లేదనే వాదన ఉంది. పాతబస్తీలో అయితే గత ఎన్నికల్లో 50 శాతం కూడా పోలింగ్ నమోదు కాకపోవడం ఇందుకు మంచి ఉదహరణ. ఈ పరిణామాల నేపథ్యంలో ఓటింగ్ శాతం మెరుగుపరిచే క్రమంలో ఈసీ ఈ మేరకు ప్రకటించి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Trending News