Vemulawada Temple: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆలయ ఆవరణలో అన్యమతస్తులు ప్రచారం చేశారనే వార్త కలకలం రేపింది. అంతటితో ఆగకుండా మాంసంతో కూడిన ఆహార పదార్థాలను పంపిణీ చేశారనే వార్త సంచలనంగా మారింది. ఈ వ్యవహారం తెలుసుకున్న హిందూత్వ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.
Also Read: KCR Wishes: క్రీస్తు శాంతి మార్గం అద్భుతం.. ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో క్రిస్మస్ శుభాకాంక్షలతో కూడిన ఆహార ప్యాకెట్లను కొంతమంది ఆలయ పరిసరాలలో బుధవారం పంపిణీ చేశారు. పంపిణీ చేసిన ప్యాకెట్లను పరిశీలించగా అందులో మాంసం ముక్కలు ఉండడంతో షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని భక్తులు చూసి ఖంగు తిన్నారు. ఈ సమాచారం హిందూత్వ సంఘాలకు తెలిసింది. వెంటనే హిందూ సంఘాల నాయకులు ఆలయం వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. ఆలయ పరిసరాలలో తిరుగుతూ ఆహార ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: KCR Petition: మాజీ సీఎం కేసీఆర్ సంచలనం.. కాళేశ్వరం అంశంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్
పవిత్రమైన దేవాలయంలో అన్య మతస్తులు క్రిస్మస్ సందర్భంగా మత ప్రచారం చేస్తూ.. మాంసంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తుంటే ఆలయ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం పై పట్టింపు లేకుండా పోయిందని మండిపడండారు. రాజన్న ఆలయ ఆవరణలో మతప్రచారం చేసి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఆలయ పరిసరాల్లో మాంసంతో కూడిన కర్రీ ప్యాకెట్లు ఎక్కడికక్కడ ఉన్నాయని వాటిని తొలగించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా రాజన్న ఆలయం వద్ద మాంసంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తూ మత ప్రచారం చేయడం సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.