PK -KCR: ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నవేళ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మూడు నాలుగు సార్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో పీకే భేటీ అయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు వ్యూహాలను సిద్ధం చేశారు. అటు కాంగ్రెస్ అధిష్టానం సైతం పీకే ప్లాన్స్‌కు ఓకే చెప్పింది.
ఇంతకు ముందే కేసీఆర్‌తో పీకే బృందం ఒప్పందం కుదుర్చుకోవడంతో తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసి పని చేస్తాయా అన్న సందేహాలు సైతం వ్యక్తమయ్యాయి. అయితే తమకు టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండబోదంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్, కేసీఆర్ మధ్య చర్చలు జరగడం కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ తో పీకేకు చెందిన సంస్థ ఐప్యాక్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటుందా అన్న సందేహాలు ఒకానొక దశలో వ్యక్తమయ్యాయి.
అయితే ఈ ఊహాగానాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నిర్ణయం తీసుకుంది. ఐప్యాక్ సేవలు కొనసాగించాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌కు పీకే బృందం సేవలందిస్తుంది. ముఖ్యంగా సర్వేలు, సంక్షేమ కార్యక్రమాలు, కొత్త ఓటర్లను ప్రభావితం చేయడం తదితర సేవలను ఐప్యాక్ అందించనుంది.
ఆదివారం సుదీర్ఘంగా సాగిన చర్చల్లో రాష్ట్ర, జాతీయ రాజకీయాలు పీకే, కేసీఆర్ మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో కేసీఆర్ కొత్త పార్టీ పెట్టే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం లేకపోతే కూటమి లేదా కొత్త పార్టీ ఏర్పాటుపై ఈ ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌తో కలిసి టీఆర్‌ఎస్ కూటమిని ఏర్పాటు చేస్తుందా ? లేక కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెడతారా అన్న అంశాలపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఒక వేళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ కలిస్తే.. రాష్ట్రంలో హస్తం పార్టీ పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికైతే ఇటు పీకే, అటు కేసీఆర్ వ్యూహాలైతే అంతుబట్టడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also See: Terrorists plan: ప్రధాని మోదీ పర్యటన భగ్నానికి ఉగ్రవాదుల కుట్ర
Also See: Tamil Nadu Train Accident: ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన ట్రైన్.. బయటకు దూకిన ప్రయాణికులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.