తెలంగాణ ప్రజల సేవల్ని కొనియాడుతూ రాష్ట్రపతి, ప్రధాని తెలుగులో విషెస్

ఎన్నో దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అవతరణ దినోత్సవం (Telangana Formation Day) నేడు (జూన్ 2). ఈ సందర్బాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Last Updated : Jun 2, 2020, 04:24 PM IST
తెలంగాణ ప్రజల సేవల్ని కొనియాడుతూ రాష్ట్రపతి, ప్రధాని తెలుగులో విషెస్

ఎన్నో దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అవతరణ దినోత్సవం (Telangana State Formation Day) నేడు (జూన్ 2). ఈ సందర్బాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind), ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)లు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, శ్రమను ప్రశంసిస్తూ తెలుగులో విషెస్ తెలపడం గమనార్హం.  అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు

‘తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం!    తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని’ రాష్ట్రపతి కోవింద్ ట్వీట్ చేశారు.  గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్

‘తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని’ రాష్ట్రపతి మరో ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

‘తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు (Telangana Formation Day). ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నానని’ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

Trending News