Pulse Polio 2021: తెలంగాణలో Pulse Polio కార్యక్రమం ప్రారంభం, చిన్నారులకు Polio Drops వేసిన మంత్రులు

Pulse Polio 2021 Programme In Telangana: నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి, కందుకూరులో మంత్రి సబిత ఇంద్రారెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 31, 2021, 11:45 AM IST
  • తెలంగాణలో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం
  • పలు జిల్లాల్లో పోలియో చుక్కలు వేసి ఈవెంట్ ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు
  • రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో 23,331 పోలియో కేంద్రాలు ఏర్పాటు
Pulse Polio 2021: తెలంగాణలో Pulse Polio కార్యక్రమం ప్రారంభం, చిన్నారులకు Polio Drops వేసిన మంత్రులు

Pulse Polio 2021 Programme In Telangana: నేటి నుంచి మూడు రోజులపాటు పల్స్ పొలియో కార్యక్రమం జరగనుంది. నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు అధికారులు ఇదివరకే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి, కందుకూరులో మంత్రి సబిత ఇంద్రారెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తెలంగాణ(Telangana)లో అయిదేళ్లలోపు చిన్నారులు మొత్తం 38,31,907 మంది ఉన్నారు. వీరికి పోలియో చుక్కలు(Pulse Polio 2021 Latest Update) వేసేందుకుగానూ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో 23,331 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు(Polio Drops) వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే దివాకర్ రావు పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Also Read: LPG Gas Cylinder: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఉచితంగా పొందాలంటే ఇలా చేయండి

 

 

‘రాష్ట్ర వ్యాప్తంగా 0 - 5 సం.ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి. మన చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు నిండైన భరోసా పోలియో చుక్కలు...’ అని మంత్రి కేటీఆర్(Telangana Minister KTR) తన మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్‌లో పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాలలో పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.

Also Read: Web WhatsApp Login: త్వరలో సరికొత్త WhatsApp Privacy ఫీచర్, 2 విధాలుగా వెబ్ లాగిన్ 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News