Python in Khammam: గ్రామంలోకి భారీ కొండచిలువ.. పరుగులు తీసిన జనాలు!

12 Feet Long Python roming in Khammam. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. కొండచిలువను చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Oct 19, 2022, 04:26 PM IST
  • ఖమ్మం జిల్లాలో కొండచిలువ కలకలం
  • గ్రామంలోకి భారీ కొండచిలువ
  • పరుగులు తీసిన జనాలు
Python in Khammam: గ్రామంలోకి భారీ కొండచిలువ.. పరుగులు తీసిన జనాలు!

12 Feet Python stirs in Khammam: జిల్లాలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో దాదాపుగా 12 అడుగుల కొండచిలువ హల్చల్ చేసింది. గురువారం అర్దరాత్రి సమయంలో అటవీ ప్రాంతం నుంచి గ్రామంలోకి వచ్చిన కొండచిలువను చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. వారు వచ్చి పామును బందించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇందుకు సంబందించిన వీడియో, ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

కిష్టారం గ్రామంలో గురువారం (అక్టోబర్ 13) రాత్రి సుమారు 12 అడుగుల కొండచిలువ రోడ్డుపై వచ్చింది. దాన్ని చూసి జనాలు పరుగులు తీశారు. ఆ కొండచిలువ రోడ్డుపై నుంచి పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లింది. ఆ ఇంట్లో వున్న వారు భయంతో బయటకు పరుగులు తీసారు. గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందిని వెంటనే సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఇంటికి చేరుకుని పామును బంధించారు. విశ్రాంత ఎఫ్బీవో మెహమూద్‌ కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వదిలేశారు.

కొండచిలువను చూడడానికి స్థానిక ప్రజలు గుంపులుగా వచ్చారు. కొండచిలువకు సంబందించిన వీడియో, ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. సింగరేణి వలన అడవి నరకటంతో విష సర్పాలు జానావాసాల్లోకి వస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో బయటకు రావాలంటేనే బయంస్తోందని అధికారులపై మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో రెండు రోజుల క్రితం కొండచిలువ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. 

Also Read: Mars Transit 2022: అక్టోబర్ 16న మిథున రాశిలోకి అంగారకుడు.. ఈ 5 రాశుల వారికి దీపావళి రోజున అదృష్టమే!

Also Read: patamata molestation case : గర్భం దాల్చిన బాలిక.. ఫ్రెండ్స్‌తో కలిసి ఆకతాయి ఘోరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News