/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Supreme court serious on cm Revanth reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కవిత బెయిల్ మీద చేసిన వ్యాఖ్యలపై అత్యున్నత ధర్మాసనం మరోసారి మండిపడింది. ఈ క్రమంలో  2015 నాటి ఓటుకు నోటు కేసులో విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణకు సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే..ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీచేయాలంటూ కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యున్నత ధర్మాసం.. న్యాయవ్యవస్థపై ఇలాంటి అనుమానాలు సబబు కాదని తెలిపింది.

కేవలం ఏదో జరిగిపోతుందని.. ఊహాజనిత వ్యాఖ్యలు చేయడం న్యాయవ్యవస్థ పట్ల గౌరవం అన్పించుకోదంటూ కూడా ధర్మాసనం ఘాటుగానే స్పందించింది. తాము.. న్యాయబద్ధంగా మాత్రమే నడుచుకుంటామని, ఒకరు ప్రభావితం చేయడం వల్ల, మరే ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని తీర్పులు చెప్పబోమని తెల్చి చెప్పింది.  ఈ నేపథ్యంలో..  కావాలంటే సీఎం రేవంత్ కేసు కోసం.. స్పెషల్ గా ఇండిపెండెంట్ ప్రాసిక్యుటర్ ను కూడా నియమించేందుకు ముందుకొచ్చింది. దీనిపైన ఇరువర్గాలకు 30 వ తారీకున ఏకాభి ప్రాయం రాకపోవడంతో..జస్టిస్ గవాయితో కూడిన ధర్మాసనం కేసును ఈరోజుకు కేసును వాయిదావేసింది.

ఈ నేపథ్యంలో సోమవారం రోజు..  సుప్రీంకోర్టులో మరోసారి ఓటుకు నోటు అంశంతో పాటు, సీఎం రేవంత్ సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలు మరోక సారి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ పోస్టులపై పూర్తి వివరణ ఇవ్వాలని కూడా ధర్మాసనం తెల్చి చెప్పింది. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్, వాట్సప్ గ్రూపుల్లో కవిత బెయిల్ అంశంపై వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

కవితకు బెయిల్ వచ్చిందా..? ఇచ్చారా ?.. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని సోషల్ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ పోస్టులు పెట్టింది. ఇవి ప్రస్తుతం సుప్రీం వరకు వెళ్లాయి. అంతేకాకుండా.. కమలంతో స్నేహం.. తైతక్క కు మోక్షం అని  తెలంగాణ కాంగ్రెస్ పలు ట్విట్ లు చేసింది. ఈ నేపథ్యంలో వీటిపై సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. ప్రస్తుతం..తెలంగాణ  పీసీసీగా రేవంత్ రెడ్డి ఉన్నందున కవిత బెయిల్ పై వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని కూడా అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.  

Read more: kolkata doctor murder: వైద్యవిద్యార్థినిపై హత్యచారం.. నిరసనల్లో పాల్గొన్న యువతి పట్ల ఆగంతకుడి పాడుపని.. 

ఇదిలా ఉండగా.. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుపై తాను చేసిన వ్యాఖ్యలపట్ల విచారం సైతం వ్యక్తం చేశారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, సుప్రీంకోర్టు పట్ల ప్రత్యేకమైన గౌరవముందన్నారు. కొంత మంది కావాలని కూడ తన వ్యాఖ్యలను తప్పుదొవపట్టించే విధంగా ఈ రకంగా ప్రచారం చేశారని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Supreme court again serious on cm revanth reddy on his controversy comments on Kavitha bail issue pa
News Source: 
Home Title: 

Supreme court: సీఎం రేవంత్ కు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ  ఆదేశాలు..
 

Supreme court: సీఎం రేవంత్ కు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ  ఆదేశాలు..
Caption: 
cmrevanthreddy(file)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

సీఎం రేవంత్ కు బిగ్ ట్విస్ట్ సుప్రీంకోర్టు..

మరోసారి సీరియస్ అయిన ధర్మాసనం..
 

Mobile Title: 
Supreme court: సీఎం రేవంత్ కు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఆ వ్యాఖ్యలపై వివరణ
Inamdar Paresh
Publish Later: 
No
Publish At: 
Monday, September 2, 2024 - 16:35
Created By: 
Indamar Paresh
Updated By: 
Indamar Paresh
Published By: 
Indamar Paresh
Request Count: 
31
Is Breaking News: 
No
Word Count: 
314