‘సీఎం కేసీఆర్ ఉండగా.. మంత్రి కేటీఆర్ ఎలా మీటింగ్ పెడతారు’

టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రజలకు చెప్పాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ (L Ramana) డిమాండ్ చేశారు. తెలంగాణలోని కరోనా బాధితులకు న్యాయం జరిగేవరకు అఖిలపక్షం పోరాటం కొనసాగిస్తుందన్నారు.

Last Updated : Aug 14, 2020, 03:29 PM IST
‘సీఎం కేసీఆర్ ఉండగా.. మంత్రి కేటీఆర్ ఎలా మీటింగ్ పెడతారు’

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంలోని విధానాలను విపక్షాలు విమర్శించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) బతికుండగా.. కేబినెట్ మంత్రులతో మరో మంత్రి కేటీఆర్ (Minister KTR) మంత్రివర్గ సమావేశం ఎలా నిర్వహిస్తారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ (L Ramana) ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని టీజేఎస్ కార్యాలయంలో విపక్షాలు శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించాయి. ఈ సందర్భంగా టీడీపీ నేత ఎల్ రమణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బతికుండగా.. కేబినెట్ భేటీని కేటీఆర్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. Telangana: తాజాగా 1,921 కరోనా కేసులు

టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. తెలంగాణలోని కరోనా బాధితులకు న్యాయం జరిగేవరకు అఖిలపక్షం పోరాటం కొనసాగిస్తుందన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆగస్టు 17 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రమణ తెలిపారు. Rain alert: రానున్న నాలుగైదు రోజుల పాటు వర్షాలు

Trending News