Rain alert: రానున్న నాలుగైదు రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ( Weather forecast ) వెల్లడించారు.

Last Updated : Aug 14, 2020, 01:15 AM IST
Rain alert: రానున్న నాలుగైదు రోజుల పాటు వర్షాలు

హైదరాబాద్: తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ( Weather forecast ) వెల్లడించారు. శుక్ర, శనివారాలు అతి భారీ వర్షాలు ( Heavy rain ) కురిసే అవకాశం ఉందని.. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 15 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం ( Heavy rainfall ) నమోదైంది. Also read : నిహారిక ఎంగేజ్‌మెంట్ ఫోటో గ్యాలరీ

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కడెం, ఎల్లంపల్లి, కొమురంభీం, కాళేశ్వరం ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆయా జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. పలు ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో పెరిగి, నీటి మట్టం పెరుగుతుండటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. Also read : Gautam Gambhir: కేజ్రీవాల్‌పై గౌతం గంభీర్ ఘాటు వ్యాఖ్యలు

Trending News