Bandi Sanjay: బండి సంజయ్ వీడియో వైరల్.. మంత్రి కేటీఆర్ సెటైర్.. ఆ వీడియోలో ఏముందో తెలుసా..?

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Written by - Srisailam | Last Updated : Aug 22, 2022, 02:08 PM IST
  • బండి సంజయ్ వీడియో వైరల్
  • సంజయ్ పై కేటీఆర్ సెటైర్లు
  • తెలంగాణ రాజకీయల్లో కాక
Bandi Sanjay: బండి సంజయ్ వీడియో వైరల్.. మంత్రి కేటీఆర్ సెటైర్.. ఆ వీడియోలో ఏముందో తెలుసా..?

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సమయంలోనే జరిగిన ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కమలనాధుల్లో కలవరం రేపుతోంది. బండి సంజయ్ వీడియోపై అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా  తీవ్రంగా స్పందిస్తోంది. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సంజయ్ పై సెటైర్లు వేశారు. తెలంగాణలో ప్రధాన చర్చగా మారిన ఆ వీడియోలో ఏముందో తెలుసా..

మునుగోడు సమరభేరీ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మధ్యాహ్నం 2 గంటలకు హై11:40 22-08-202211:41 22-08-2022దరాబాద్ చేరుకున్నారు అమిత్ షా. బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండైన అమిత్ షా.. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఆలయంలో పూజలు అనంతరం బయటికివచ్చిన అమిత్ షాకు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పులు అందించారు. అమిత్ షా చెప్పులను బండి సంజయ్‌ స్వయంగా తన చేతులతో తీసుకెళ్లి అతని కాళ్ల దగ్గర పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోనే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. అమిత్ షా చెప్పులను బండి సంజయ్ తీసుకెళ్తున వీడియోపై స్పందించారు మంత్రి కేటీఆర్. తనదైనశైలిలో సంజయ్ కి పంచ్ లు వేస్తూ ట్వీట్ చేశారు.

డిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములు ఎవరో .. ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడు ఎవరో తెలంగాణ రాష్ట్రం గమనిస్తోంది అంటూ ట్వీట్ చేశారు. బండి సంజయ్ వీడియోను ట్యాగ్ చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది. ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడు అంటూ కేసీఆర్‌ని ఉదాహరణగా చూపిస్తూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు కేటీఆర్. బండి సంజయ్ ట్వీట్ పై  నెటిజన్లు, టీఆర్ఎస్‌ ఫాలోవర్స్ స్పందిస్తున్నారు. 

Also read: Munugode Bypoll: అమిత్ షా సభతో బీజేపీలో జోష్.. బీసీ కార్డు పైనే టీఆర్ఎస్ ఫోకస్?

Also read:  Sovereign Gold Bond Scheme : గోల్డ్ ఇన్వెస్టర్స్‌కు గుడ్ న్యూస్.. నేటి నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ రెండో సిరీస్.. కస్టమర్స్ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News