తెలంగాణపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి - టి. బీజేపీ చీఫ్ లక్ష్మణ్

తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలపై తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ స ్పందించారు

Last Updated : Jun 13, 2019, 11:35 PM IST
తెలంగాణపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి - టి. బీజేపీ చీఫ్ లక్ష్మణ్

అఖండ భారత దేశంలో పాగవేయడమే లక్ష్యంగా కదులుతున్న బీజేపీ.. ఇప్పటికే ఉత్తర భారత దేశంలో పూర్తి స్థాయిలో బంగా ఉందని.. భవిష్యత్తులో దక్షిణాదిన కూడా పాగా వేస్తుందనే నమ్మకం ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇప్పటికే కర్నాటక రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ  తెలంగాణలోనే బీజేపీ పాగ వేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం సీనియర్ గా దృష్టి సారించిందని లక్ష్మణ్‌ వెల్లడించారు. 

ఫిరాయింపులు మంచిది కాదు

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ జాతీయ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న అనంతరం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ భేటీ వివరాలను తెలిపారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై అమిత్‌షా ప్రత్యేకంగా అభినందించారని వివరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పని..ఇప్పుడు టీఆర్ఎస్ చేస్తోందని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులు ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు.

అభద్రతా భావంలో కేసీఆర్..

సీఎం కేసీఆర్‌ అభద్రతా భావంతోనే  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను  టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని లక్ష్మణ్ విమర్శించారు.  జులై 6 నుంచి తెలంగాణలో పార్టీ  సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా బీజేపీ నేత లక్ష్మణ్ పేర్కొన్నారు.

Trending News