హైదరాబాద్: మల్కాజ్ గిరి ఎంపీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అద్యక్షుడు రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జన్వాడలోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫేమ్ హౌస్ నిర్మించారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి తన అనుచరులతో ధర్నాకు దిగారు.
ఈ క్రమంలో డ్రోన్ తో ఫోటోలు తీశారన్న అభియోగంపై పోలీసులు కేసు నమోదు చేసి 14 రోజుల రిమాండుకు పంపారు. ఈ నేపథ్యంలో నేడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఇరు వర్గాల మధ్య వాదనలు కొనసాగాయి. కాగా రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది మీడియా తో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. రేవంత్ కు తెలియకుండా ఎలాంటి ముందస్తు నోటీస్ లు లేకుండా కేసులు పెట్టారని న్యాయవాది పేర్కొన్నారు. చివరగా ఇరు పక్షాల వాదనలు విన్న 16వ మేజిస్ట్రేట్ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసిందని తెలియజేశారు.
Read Also: కమలం ఆట- కాంగ్రెస్‌కు కటకట
ఇదే అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు స్పందిస్తూ.. ప్రభుత్వం రేవంత్ రెడ్డిపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కక్ష పూరిత డ్రామాలు చేస్తోందని, ప్రభుత్వ అక్రమాలను ప్రశ్ని స్తున్నందుకే తమ నాయకుడిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజావ్యతిరేక పాలన అవలంభిస్తోన్న తెరాస ప్రభుత్వంపై తమ పోరు కొనసాగుతోందని వ్యాఖానించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..