Telangana Farmer Loan Waiver Scheme: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల్లో అత్యంత కీలకమైంద రుణమాఫీ. రైతుల రుణాల్నిమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని మూడు దశల్లో అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ తొలి విడతగా రైతు రుణమాఫీ డబ్బుల్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
తెలంగాణ రైతులకు ఇవాళ గుడ్ న్యూస్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రుణమాఫీ డబ్బులు ఇవాళ అందనున్నాయి. ఇవాళ్టి నుంచి ఆగస్టులోగా మూడు దశల్లో రుణమాఫీ డబ్బుల్ని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొదటి విడతలో ఇవాళ లక్ష రూపాయల వరకూ రుణాలున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ నెలాఖరువరకూ లక్షన్నర రూపాయల రుణాలు మాఫీ కానున్నాయి. ఇక ఆగస్టు నెలలో రెండు లక్షల వరకూ ఉన్న రైతు రుణాలు మాఫీ కానున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆర్భాటంగా రుణమాఫీ కార్యక్రమం జరగనుంది. మొత్తానికి ఆగస్టు 15లోగా ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.ఇవాళ తొలిరోజు 7 వేల కోట్లు రైతుల ఖాతాల్లో రుణామాఫీ కింద జమకానున్నాయి. ఆగస్టు 15 వరకూ మొత్తం 31 వేల కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి. రైతు రుణ మాఫీకు సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
రుణమాఫీకు అర్హులెవరు
భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకూ పంట రుణమాఫీ జరుగుతుంది. రాష్ట్రంలోని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుంది. 2018 డిసెంబర్ 12 నుంచి మంజూరైన లేదా రెన్యువల్ అయిన రుణాలకు 2023 డిసెంబర్ 9 నాటికి బకాయి ఉన్న రుణాలకు ఈ పధకం వర్తిస్తుంది. రేషన్ కార్డును ప్రామాణికంగా పరిగణించడమే కాకుండా ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లల్ని కలిపి ఒక యూనిట్ గా లెక్కిస్తారు.
రుణమాఫీ లబ్దిదారుల్ని గుర్తించేందుకు బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాలోని ఆధార్ కార్డు పాస్ బుక్ డేటా బేస్ తో మ్యాపింగ్ చేసి సరిచూస్తారు. డీబీటీ పద్ధతిలో నేరుగా రుణ మాఫీ డబ్బులు జమ అవుతాయి. 2023 డిసెంబర్ 9 నాటికి ఉన్న రుణాన్ని గరిష్టంగా 2 లక్షల వరకూ తక్కువ నుంచి ఎక్కువ క్రమంలో చెల్లింపులు జరుగుతాయి.
రుణమాఫీకు అనర్హులెవరు
స్వయం సహాయక సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, రైతు మిత్ర గ్రూపులు, ఎల్ఈసీఎస్ రుణాలకు వర్తించదు. రీషెడ్యూల్ రుణాలకు కూడా రుణమాఫీ అమలు కాదు. కంపెనీలు, ఫర్మ్స్ కు ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ మినహాయింపుల్ని వీలైనంతవరకూ పరిగణలో తీసుకుంటారు.
Also read: Sim Cards Misuse: మీకు తెలియకుండా మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇలా తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook