Online classes: హైదరాబాద్: కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రైవేటు స్కూల్స్ ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడమే కాకుండా ఫీజులు ( School fee) కూడా వసూలు చేస్తుండటంపై తెలంగాణ హై కోర్టు ( TS High court ) శుక్రవారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా ఓవైపు వేల మంది జీవితాలనే కోల్పోతుంటే... ఇప్పుడప్పుడే అంత హడావిడాగా ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని హై కోర్టు ప్రైవేటు పాఠశాలలను ( Private schools ) ప్రశ్నించింది. కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించకపోతే మిన్ను విరిగి మీద పడుతుందా అంటూ హై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. అంతేకాకుండా ఫీజు వసూలు విషయంలో ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయం తీసుకోకముందే ప్రైవేటు స్కూల్స్ అప్పుడే ఫీజు ఎలా వసూలు చేస్తాయంటూ హై కోర్టు మండిపడింది.
Also read: Telangana: ఒక్కరోజే 1,892 కరోనా పాజిటివ్ కేసులు
ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు స్కూల్స్.. అందుకోసం ల్యాప్‌టాప్స్ కొనుగోలు ( Buying Laptops ) చేయాలని, ఇంటర్నెట్ కనెక్షన్ ( Internet connection ) తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్నాయని.. అంతేకాకుండా ఫీజులు కూడా వసూలు చేస్తున్నాయని పేర్కొంటూ హైదరాబాద్ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ హై కోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ క్లాసెస్ పేరిట స్కూల్ ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ ఆగడాలను అడ్డుకోవాల్సిందిగా కోరుతూ దాఖలైన ఆ పిల్ శుక్రవారం విచారణకు వచ్చిన సందర్భంగా హై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ( Also read: PM Modi`s Ladakh visit: ప్రధాని లఢక్ పర్యటనపై స్పందించిన చైనా )