Telangana: ఇదే చివరి అవకాశం, ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన హైకోర్టు

తెలంగాణ ( Telangana ) లో కరోనా వైరస్ ( Corona Virus ) రోజురోజుకూ కోరలు చాచుతోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ హైకోర్టు  ( Telangana High court ) మరోసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి వార్నింగ్ అని కూడా హెచ్చరించింది

Last Updated : Jul 20, 2020, 07:04 PM IST
Telangana: ఇదే చివరి అవకాశం, ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన హైకోర్టు

తెలంగాణ ( Telangana ) లో కరోనా వైరస్ ( Corona Virus ) రోజురోజుకూ కోరలు చాచుతోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ హైకోర్టు  ( Telangana High court ) మరోసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి వార్నింగ్ అని కూడా హెచ్చరించింది.

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ( Telangana Government ) పై హైకోర్టు ఆగ్రహం కొనసాగుతోంది. కరోనా మహమ్మారి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై గతంలో కూడా హైకోర్టు వార్నింగ్ ( High Court Serious ) ఇచ్చింది. ఇప్పుడు మరోసారి తీవ్ర పదజాలంతో హెచ్చరించింది. ఇదే చివరి అవకాశమని..తమ సహనాన్ని పరీక్షించవద్దని కోరింది హైకోర్టు. తమ ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు తప్పవని కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. Also read: TS Secretaria: రేవంత్ పిటీషన్‌పై గ్రీన్ ట్రిబ్యూనల్ విచారణ

కరోనా కట్టడిపై విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్ ( Health Bulletin ) లో అన్ని వివరాలు ఉండాలని ప్రభుత్వాన్ని సూచించింది. వైద్య ఆరోగ్య శాఖ వెబ్ సైట్ ను తక్షణం యాక్టివేట్ చేయాలని కోరింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీ కేసుల్ని కలెక్టర్లు వెల్లడించాలని, ప్రైమరీ కాంటాక్ట్ పరీక్షల వివరాలు, ర్యాపిడ్ యాక్షన్ టెస్ట్ సెంటర్ల వివరాల్ని అందించాలని హైకోర్టు ఆదేశించింది. పెళ్లిళ్లకు ఎక్కువ మంది హాజరుకాకుండా చూడాలని సూచించింది. 

గతంలో జరిగిన విచారణ సందర్బంగా ప్రభుత్వం ప్రజల్ని గాలికొదిలేసినట్టు హైకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల్ని పాటించని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని కోర్టు ప్రశ్నించింది. అటువంటి అధికార్లను ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది. ఢిల్లీ ( Delhi ) , ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) తో పోలిస్తే కరోనా పరీక్షల్లో తెలంగాణ వెనకబడి ఉండటాన్ని హైకోర్టు ప్రస్తావించింది. ఓ వైపు తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతుంటే..ప్రభుత్వం నిద్రపోతుందా అని సైతం ప్రశ్నించింది. Also read: AP: త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ కొలువుల పందేరం

Trending News