ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో త్వరలో రాజకీయ పదవులు కొలువు రానుంది. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన పదవుల భర్తీతో పాటు కేబినెట్ విస్తరణ ( Cabinet Extension ) కూడా ఉండటంతో ఆశావహులు అధికమయ్యారు. కార్పొరేషన్ పదవుల కోసం క్యూ ఏర్పడింది ఇప్పుడు ఏపీలో.
ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం ( Ycp Government ) త్వరలో రాజకీయ పదవుల్ని భర్తీ చేయనుంది. బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ( BC Corporation Chairmans ) , డైరెక్టర్ ( Director ) పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( CM Ys Jagan ) స్పష్టం చేశారు. బీసీ పరిధిలో ఉన్న వివిధ ఉప కులాలకు సంబంధించిన కార్పొరేషన్ల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ( Deputy Cm Pilli Subhash Chandra Bose ), మంత్రులు శంకర నారాయణ ( Minister Sankar Narayana ) , బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana ) , ధర్మాన కృష్ణదాస్ ( Minister Dharmana Krishnadas ) , మోపిదేవి ( Minister Mopidevi ) , ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సమీక్షకు హాజరయ్యారు. Also read: Ap Cabinet: కేబినెట్ విస్తరణలో స్పీకర్ మంత్రి అయ్యేనా?
మొత్తం 52 కార్పొరేషన్లను ( 52 Corporations ) ఏర్పాటు చేయనున్నట్టు సీఎం జగన్ ( Ap cm ys jagan ) తెలిపారు. గతంలో 69 కులాలకే ప్రాధాన్యత కల్పించారని..ఇప్పుడు అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లలో ప్రాధాన్యత కల్పిస్తున్నామని జగన్ చెప్పారు.
ఇది కాకుండా త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో స్థానం కోసం ఆశావహులు నిరీక్షిస్తున్నారు. ఏపీ కేబినెట్ విస్తరణ ఈ వారంలోనే ఉండవచ్చని తెలుస్తోంది. Also read: Corona Symptoms: కోవిడ్19 వైరస్ అదనపు లక్షణాలివే