TS Secretaria: రేవంత్ పిటీషన్‌పై గ్రీన్ ట్రిబ్యూనల్ విచారణ

Revanth Reddy: తెలంగాణ సచివాలయ కూల్చివేతను ( Secretariat Demolition ) వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి వేసిన పిటీషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్  ( National Green Tribunal ) విచారణ చేపట్టింది.  

Last Updated : Jul 20, 2020, 03:28 PM IST
TS Secretaria: రేవంత్ పిటీషన్‌పై గ్రీన్ ట్రిబ్యూనల్ విచారణ

Revanth Reddy: తెలంగాణ సచివాలయ కూల్చివేతను ( Secretariat Demolition ) వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి వేసిన పిటీషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ( National Green Tribunal ) విచారణ చేపట్టింది. సచివాలయం కూల్చివేత అనేది పర్యావరణంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అని రేవంత్ రెడ్డి కొంత కాలం క్రితం పిటీషన్‌ వేశాడు. దీనికి స్వీకరించిన ట్రిబ్యూనల్ ఈ కూల్చివేత వల్ల పర్యావరణంపై కలిగే ప్రభావం, వ్యర్థాల నిర్వహణపై ( Waste Management ) అధ్యయనానికి కిమిటీని నియమించింది. రెండునెలల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. Salman Khan: ట్రాక్టర్ నడుపుతున్న సల్మాన్

నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఏర్పాటు చేసిన ఈ కమిటీలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్ ( IIT Hyderabad ), తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి స్థానం కల్పించారు. ఉత్తర్వులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. దాంతో పాటు తదుపరి విచారణనను సెప్టెంబర్ 25 వరకు వాయిదా వేశారు.

Sushant Singh Rajput: సుశాంత్ రియల్ లైఫ్ మూవీ ఫస్ట్ లుక్

Follow us on twitter

Trending News