Telangana Inter Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..? అధికారులు ఏమంటున్నారు..!

Telangana Inter Results: తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్‌ 25లోపు రావాల్సిన రిజల్ట్ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా అధికార వర్గాల నుంచి కొత్త న్యూస్ వైరల్‌గా మారింది.

Written by - Alla Swamy | Last Updated : Jun 26, 2022, 06:59 PM IST
  • ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ
  • జూన్‌ 25లోపు రావాల్సిన రిజల్ట్
  • కసరత్తు చేస్తున్న అధికారులు
Telangana Inter Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..? అధికారులు ఏమంటున్నారు..!

Telangana Inter Results: తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్‌ 25లోపు రావాల్సిన రిజల్ట్ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా అధికార వర్గాల నుంచి కొత్త న్యూస్ వైరల్‌గా మారింది. రెండు మూడు రోజుల్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ముల్యాంకనం పూర్తైంది. మార్కులు సైతం ఖరారైయ్యాయి.

అప్‌లోడింగ్‌తోనే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పక్కగా రిజల్ట్ ఇస్తున్నామంటున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఫలితాలు ఆలస్యమవుతున్నాయని చెబుతున్నారు. రేపు(సోమవారం) సాయంత్రంలోపు ఫలితాలు వస్తాయని..ఆన్‌లైన్‌లో అప్‌లోడింగ్  చేస్తామని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడిస్తున్నారు. ఫలితాల విషయాన్ని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్‌ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌ అధికారులు ధృవీకరిస్తున్నారు.

తాజాగా ఫలితాలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలుస్తోంది. విద్యా శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఫలితాల ఆలస్యంలో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని..దీనిపై అసత్య ప్రచారం నమ్మొద్దని అధికారులు చెబుతున్నారు. ఈనెలాఖరు లోపు ఫలితాలు వెల్లడిస్తామని ఇదివరకే మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Also read: Ranji Trophy 2021-22: రంజీ ట్రోఫీని ముద్దాడిన మధ్యప్రదేశ్‌..ఆటగాళ్ల భావోద్వేగం..!

Also read:CM Jagan Tweet: ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్ష..ఆత్మకూరు విజయంపై సీఎం జగన్‌ ఆసక్తికర ట్వీట్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News