Medak Additional Collector Nagesh caught by ACB: తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రోజే ఏసీబీకీ మరో భారీ తిమింగలం చిక్కింది. ఇటీవలనే కీసర తహసీల్దార్ నాగరాజు రూ.1.10కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి మరువకముందే.. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటు పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన మూర్తి అనే వ్యక్తికి మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలోని 112 ఎకరాల పట్టా భూమి ఉంది. దీనికి సంబంధించిన భూమికి ఎన్ఓసీ ఇవ్వడానికి మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఎకరానికి లక్ష చొప్పున లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు మూర్తి.. పలువురు ఏసీబీ (ACB) ని ఆశ్రయించారు. ఆ క్రమంలో బుధవారం రూ.1.12 కోట్లకు సంబంధించి 40 లక్షలతోపాటు.. మిగతా డబ్బుకు అగ్రిమెంట్ తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులకు నగేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. Also read: New Revenue Act: త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం
ఆ తర్వాత నగేష్‌కు చెందిన అధికారిక నివాసంతోపాటు పలు ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీంతోపాటు ఈ వ్యవహారంలో పాత్ర మరో 12 మంది ఇళ్లల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్డీవో అరుణ, నరసాపూర్ తహసీల్దార్ మాలతి, వీఆర్ఓ, వీఆర్ఏలతో కలిపి 12 మంది ఇళ్లల్లో ఏకాకాలంలో తనిఖీలు చేస్తున్నారు. అయితే ఆర్డీవో అరుణా రెడ్డి ఇంట్లో 20 లక్షలు బంగారం, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు నగష్ ఇంట్లో పలు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. Also read : Eng vs Pak 1st T20I: ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్