తెలంగాణ ప్రభుత్వం ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలను పెద్ద ఎత్తున చేపట్టాలని భావిస్తోంది. అందు కోసం నోటిఫికేషన్లను జారీ చేసింది. దాదాపు 18,428 ఉద్యోగాల నియామకం చేపట్టే అవకాశం ఉందనేది సమాచారం. వీటిలో 16,925 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేస్తుండగా.. 1503 ఎస్సై ఉద్యోగాలు చేయడానికి కూడా రంగం సిద్ధమైంది. పోలీసు నియామక సంస్థ ఆధ్వర్యంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి వేరు వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. అలాగే కానిస్టేబుల్ నియామకాలను అధిక సంఖ్యలో చేసేందుకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ను కనీస అర్హతగా పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల కోసం జూన్ 9 నుంచి 30వ తేది వరకు ఆన్లైన్లోఅభ్యర్థులు దరఖాస్తులను పంపించవచ్చు.
ఇక వయోపరిమితి విషయంలో పలు పోస్టులకు మాత్రమే వెసులుబాటు కల్పించారు. హోంగార్డులుగా ఏడాది పనిచేసిన వారికి కూడా సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యాక సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహించి ఎంపిక ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.