Corona in Telangana: రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు- 31వేలపైకి యాక్టివ్​ కేసులు

Corona in Telangana: తెలంగాణలో కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2022, 08:40 PM IST
  • రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు
  • క్రితం రోజుతో పోలిస్తే తగ్గిన టెస్టుల సంఖ్య
  • భారీగా పడిపోయిన రికవరీ రేటు
Corona in Telangana: రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు- 31వేలపైకి యాక్టివ్​ కేసులు

Corona in Telangana: తెలంగాణలో కరోనా ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజాగా 4,393 మందికి పాజిటివ్​గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య విభాగం శనివారం సాయంత్రం వెల్లడించింది. మొత్తం 1,16,2324 టెస్టులకుగానూ.. ఈ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే.. టెస్టుల సంఖ్య (Corona cases down in Telangana) స్వల్పంగా తగ్గింది.

శుక్రవారం సాయంత్రం ఐదున్నర నుంచి నేడు (శనివారం) సాయంత్రం 5:30 వరకు ఈ కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం పేర్కొంది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 7,31,212 వద్దకు (Total Corona cases in Telangana) చేరింది.

రాష్ట్రంలో కరోనా రికవరీలు..

ఇక గడిచిన 24 గంటల్లో 2,319 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,95,942 మంది కరోనాను జయించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 95.18 శాతానికి తగ్గింది.

మహమ్మారికి రాష్ట్రంలో తాజాగా మరో ఇద్దరు బలయ్యారు. రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 4,071కు (Corona deaths in Telangana) చేరినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో కొవిడ్ మరణాల రేటు 0.56 శాతంగా ఉంది.

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 31,199 యాక్టివ్​ కొవిడ్ కేసులు (Corona active cases in Telangana) ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,12,85,422 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. ప్రతి పది లక్షల మందికి గానూ.. 8,40,554 పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఇంకా 9,537 శాంపిళ్ల పరీక్షా ఫలితాలు తెలియాల్సి (Telangana Covid update) ఉందని పేర్కొంది.

Also read: మినిస్టర్ సార్.. నా ఆత్మహత్యకు అనుమతినివ్వండి.. కేటీఆర్‌కు యువ రైతు లేఖ..

Also read: Rains in Telangana: వెదర్ అలర్ట్.. తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News