Telangana Corona Cases: తెలంగాణలో తాజాగా 2,157 కరోనా పాజిటివ్ కేసులు

Telangana COVID-19 Positive Cases: తెలంగాణలో తాజాగా 2,157 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,738కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 14, 2021, 11:26 AM IST
Telangana Corona Cases: తెలంగాణలో తాజాగా 2,157 కరోనా పాజిటివ్ కేసులు

Telangana COVID-19 Positive Cases: తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలో ప్రతిరోజూ లక్షన్నరకు పైగా కరోనా కేసులు నిర్ధారణ అవుతున్నాయి. తెలంగాణలో తాజాగా 2,157 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,738కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రాత్రి 8 గంటల వరకు గత 24 గంటల్లో 72,364 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో రెండు వేల నూట యాభై ఏడు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 34 వేల 7 వందల 38కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ రాష్ట్రంలో మరో ఎనిమిది మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,780కి చేరింది.

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం, అప్రమత్తమైన GHMC అధికారులు

పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కోవిడ్19 నిబంధనలు కఠినతరం చేసింది. మాస్క్ లేకుండా బయట తిరుగుతున్న వారికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజు రాష్ట్రంలో చికిత్స అనంతరం కోవిడ్-19(Covid-19) నుంచి 821 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,07,499 మంది కరోనా మహమ్మారిని జయించారు. 

నమోదవుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసులలో అధికంగా జీహెచ్ఎంసీలోనే నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోనే 361 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 25 వేల 459 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం క్వారంటైన్‌లో 16,892 మంది చికిత్స పొందుతున్నారు.

Also Read: Gold Price Today 14 April 2021: బులియన్ మార్కెట్‌లో మళ్లీ దిగొచ్చిన బంగారం, వెండి ధరలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News