గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోనూ కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తీవ్రతరం అవుతోంది. తెలంగాణలో తాజాగా 412 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,867కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
తెలంగాణలో సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 68,171 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో 412 శాంపిల్స్ కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. వీటితో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,867కి చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ ముగ్గురు వ్యక్తులు మరణించారు. దీంతో తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,674కి చేరింది.
Also Read; Gold Price Today: బులియన్ మార్కెట్‌లో పతనమైన బంగారం ధర, పసిడి దారిలో వెండి ధరలు
నిన్న ఒక్కరోజు కోలుకున్న వారి సంఖ్య కన్నా పాజిటివ్ కేసులే అధికంగా నమోదు అవుతున్నాయి. సోమవారం నాడు 216 మంది చికిత్స అనంతరం కోవిడ్-19(COVID-19) బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 2,99,042 మంది కరోనాను జయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన కేసులలో 103 జీహెచ్ఎంసీలోనే నమోదు కావడం గమనార్హం.
Also Read: EPFO: ఒక్క మిస్డ్ కాల్ ద్వారా ఖాతాదారులు EPF Balance వివరాలు తెలుసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook