TS SSC Results 2022: టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఈ నెల 30న పదో తరగతి పరీక్షా ఫలితాలు...

TS SSC Results 2022:  తెలంగాణలో ఇవాళ ఇంటర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో పదో తరగతి పరీక్షా ఫలితాలు కూడా విడుదలకానున్నాయి.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jun 28, 2022, 08:00 PM IST
TS SSC Results 2022: టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఈ నెల 30న పదో తరగతి పరీక్షా ఫలితాలు...

TS SSC Results 2022: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు గురువారం (జూన్ 30) విడుదల కానున్నాయి. ఆరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాల విడుదలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఆ ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు సమాచారం.

తెలంగాణలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఆ మరుసటి రోజు నుంచే స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభమైంది. కరోనా కారణంగా ఈసారి 11 పేపర్లకు బదులు కేవలం ఆరు పేపర్లకే పరీక్ష నిర్వహించారు.సిలబస్‌ను 30 శాతం తగ్గించడంతో పాటు ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్ ఎక్కువగా ఇచ్చారు.

 ఈసారి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.  వీరిలో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు పరీక్షలు లేకుండానే ప్రభుత్వం విద్యార్థులను పాస్ చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్ల తర్వాత నిర్వహించిన పరీక్షలు కావడంతో ఫలితాలపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు result.cgg.gov.in, tsbie.telangana.gov.in, manabadi.co.in వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ విద్యాశాఖ ఇవాళే ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్‌లో 63.32 శాతం సెకండియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో మేడ్చల్ జిల్లాలో టాప్‌లో నిలవగా..  మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. తాజాగా టెట్ ఫలితాల వెల్లడిపై కూడా విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. జూలై 1న టెట్ ఫలితాలు విడుదలకానున్నాయి. నిజానికి జూన్ 27నే ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ .. ఫైనల్ కీ ఇంకా విడుదల కాకపోవడంతో టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి.

Also Read: LPG Connection: ఇవాళ్టి నుంచి గ్యాస్ కనెక్షన్ కూడా భారమే, ఒక్కో కనెక్షన్‌పై 1050

Also Read: Twins Veena Vani: ఫస్ట్ క్లాస్ లో ఇంటర్ పాసైన వీణ వాణి.. చాటెడ్ అకౌంటెంట్ కావడమే అవిభక్త కవల లక్ష్యమట!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News