వచ్చే సమావేశాల్లోనే సీఏఏ వ్యతిరేక బిల్లు..

తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2020 వార్షిక బడ్జెట్ సమావేశాలు మార్చి 6వ తేదీన ప్రారంభం కానున్నాయని, ఈ సమావేశాలు రెండు వారాలపాటు జరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

Updated: Feb 23, 2020, 06:25 PM IST
వచ్చే సమావేశాల్లోనే సీఏఏ వ్యతిరేక బిల్లు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2020 వార్షిక బడ్జెట్ సమావేశాలు మార్చి 6వ తేదీన ప్రారంభం కానున్నాయని, ఈ సమావేశాలు రెండు వారాలపాటు జరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజున రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలిపారు. 

కాగా, మార్చి 8వ తేదీన అసెంబ్లీలో ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారని, అలాగే శాసన సభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదే బడ్జెట్ ను కౌన్సిల్ లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. మరోవైపు, సీఏఏ 2019 బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీ స్పష్టత నివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ సమాశాల్లో సీఏఏ వ్యతిరేక బిల్లును తెలంగాణ అసెంబ్లీ అమోదించనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఇప్పటికే సీఏఏ 2019 బిల్లును వ్యతిరేకించిన విషయం తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..