Telangana Rains Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాబోయే మూడు రోజులు ఎలా ఉండనుందంటే..

Telangana Rains Alert: సుమారు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద సముద్ర మట్టానికి సుమరు 4.5 కి.మి, 7.6 కి.మీ మధ్యలో గాలి విచ్చిన్నతి కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో మరొక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2023, 06:12 AM IST
Telangana Rains Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాబోయే మూడు రోజులు ఎలా ఉండనుందంటే..

Telangana Rains Alert: తెలంగాణకు సోమవారం, మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని.. అలాగే బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదివారం నాడు ఉత్తర జార్ఖండ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఛత్తీస్‌గఢ్ , ఉత్తర అంతర్గత ఒడిషా వద్ద వున్న అల్పపీడనం ఆదివారం బలహీన పడిందని... అయితే దీని అనుబంద ఆవర్తనం ఆదివారం దక్షిణ జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సుమరు 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపునకు వాలి ఉంది అని తెలిపారు. 

సుమారు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద సముద్ర మట్టానికి సుమరు 4.5 కి.మి, 7.6 కి.మీ మధ్యలో గాలి విచ్చిన్నతి కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో మరొక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. 

తెలంగాణలో రాగల 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే..
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం, సోమవారం చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు, ఎల్లుండి అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదే సమయంలో తెలంగాణలో సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.

Trending News