విషాదం.. రోడ్డుప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం

ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

Shankar Dukanam Shankar Dukanam | Updated: Feb 14, 2020, 01:22 PM IST
విషాదం.. రోడ్డుప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం

గీసుకొండ (వరంగల్ రూరల్) : వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఘటన వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గంగదేవిపల్లి గ్రామానికి చెందిన న్యాల నవీన్‌(20), ఇట్ల జగదీశ్‌(19), జనగామ జిల్లా నర్మెట్ట మండలం మాన్‌సింగ్‌ తండాకు చెందిన లకావత్‌ గణేష్‌(21)లు ద్విచక్ర వాహనంపై వరంగల్‌ నుంచి గంగదేవిపల్లికి బయలుదేరారు.

Also Read: రాంగ్ రూట్ జర్నీ.. పాపం గాల్లోకి ఎగిరిపడ్డాడు.. వైరల్ వీడియో 

గంగదేవిపల్లి సమీపానికి చేరుకోగానే వారు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు  ఢీకొట్టింది. దీంతో బైకు మీద ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ప్రమాద స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: మహిళ మృతదేహాన్ని వెలికితీసి గుండుగీసి! 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..