హుజూర్‌నగర్‌లో గెలిచి రికార్డు సృష్టించిన సైది రెడ్డి

హుజూర్‌నగర్‌లో గెలిచి రికార్డు సృష్టించిన సైది రెడ్డి

Updated: Oct 24, 2019, 04:29 PM IST
హుజూర్‌నగర్‌లో గెలిచి రికార్డు సృష్టించిన సైది రెడ్డి

సూర్యాపేట: హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడమే కాకుండా హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గం చరిత్రలోనే ఓ రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డిపై 43,284 ఓట్ల మెజార్టీతో సైది రెడ్డి గెలుపొందారు. ఇప్పటి వరకు హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఉన్న భారీ మెజార్టీ రికార్డ్‌ 29,194 ఓట్లు మాత్రమే. అయితే, ఈ ఉప ఎన్నికతో సైది రెడ్డి 43,284 ఓట్ల మెజార్టీ సాధించి పాత రికార్డును బ్రేక్ చేసి కొత్త రికార్డు నమోదు చేశారు. సైదిరెడ్డికి వచ్చినంత భారీ మెజార్టీ గతంలో హుజూర్‌నగర్‌‌ చరిత్రలోనే ఎవ్వరూ సాధించకపోవడం టీఆర్ఎస్ శ్రేణులను మరింత ఆనందానికి గురిచేస్తోంది. 

ఈ విజయంతో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న హుజూర్‌నగర్‌లో తొలిసారిగా టీఆర్ఎస్ విజయ బావుటా ఎగురవేసింది. ఈ ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం గమనార్హం.